అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బాలో ఇళ్ల నిర్మాణాలను శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక మంజూరు ప్రక్రియలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతుండటంతో పట్టణ ప్రాంతాల్లో కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు మెప్మా(Mepma) ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ (Bank linkage Loans) కింద రుణం అందించేలా చొరవ చూపాలన్నారు. ఆయా దశల్లో ఇళ్ల నిర్మాణాలను అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాలో బిల్లులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Indiramma Housing Scheme | అభయ హస్తం కాలనీ సందర్శన..
దుబ్బ సమీపంలోని అభయ హస్తం కాలనీని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. అసైన్డ్ భూమిని పరిశీలించిన కలెక్టర్ జాయింట్ సర్వే జరిపి హద్దులను నిర్ధారించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ(Municipal Corporation) కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డీఈ నివర్తి, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు అధికారి రమేష్, నార్త్ తహశీల్దార్ విజయ్‌కాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.