Homeజిల్లాలునిజామాబాద్​Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేలా చొరవ చూపాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ (balkonda) మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదు ఎక్కడా రావొద్దన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 41 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా వారంతా ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే ఆర్డీవో దృష్టికి తేవాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీడీవో విజయ్ భాస్కర్ ఉన్నారు.

భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు

అక్షరటుడే, ఇందల్వాయి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జక్రాన్​పల్లి (jakranpally) మండలం కేశ్​పల్లిలో (Keshpally) గురువారం రెవెన్యూ సదస్సులో (Revenue Conference) ఆయన పాల్గొన్నారు. దరఖాస్తుల తీరును పరిశీలించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల ఆధారంగానే సమస్యను పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ మెండోరా (Mendora Tahsildar’s office) తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్ట్​ కింద మెండోరా మండలంలోని 8 గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో భూసమస్యల పరిష్కార పనితీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహశీల్దార్లు కిరణ్మయి, సంతోష్ రెడ్డి, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.