ePaper
More
    HomeతెలంగాణNizamabad Collector | ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ముందుండాలి

    Nizamabad Collector | ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ముందుండాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma house Scheem) అమలులో నిజామాబాద్ కార్పొరేషన్ ముందుండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. నగరంలోని ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై సోమవారం నగరపాలక సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒక్కో డివిజన్ వారీగా వార్డు ఆఫీసర్లకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో తెలుసుకున్నారు. తిరస్కరించిన దరఖాస్తులను ఏ కారణాల వల్ల రిజెక్ట్ జాబితాలో (rejected applications) చేర్చారో వివరాలు అడిగారు. చిన్న కారణాలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపి ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యసాధన కృషి చేయాలని సూచించారు. వారం రోజుల తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఒక్కో డివిజన్ వారీగా సాధించిన ప్రగతి వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. నివేదికలు పొందుపర్చిన వివరాలు తప్పుగా ఉన్నాయని తెలిస్తే సంబంధిత వార్డు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంటి స్థలం (house plot) ఉండి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరయ్యేలా చూడాలని తెలిపారు.

    Nizamabad Collector | సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి

    వర్షాకాలంలో సీజనల్ (rainy season) వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మున్సిపల్​ అధికారులను, వార్డు ఆఫీసర్లను ఆదేశించారు. డెంగీ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటి వ్యాధులు సోకకుండా విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. అన్ని డివిజన్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. తాగునీటి పైప్ లైన్ (drinking water pipeline) లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ప్రతి ట్యాంకును శుభ్రం చేయిస్తూ క్లోరినేషన్ జరిగేలా చూడాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్, ఆయిల్ బాల్స్ తదితర చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఎంహెచ్​వో డాక్టర్ రాజశ్రీ, తహశీల్దార్లు బాలరాజు, విజయ్​కాంత్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...