అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) సూచించారు. జిల్లా కలెక్టరేట్లో తహశీల్దార్లతో శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుకను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేకంగా జారీ చేసిన వేబిల్లులను అందించాలని సూచించారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) నిర్మాణాల పేరుతో ఇసుక పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఎంపీడీవోలు, ఎంపీవోలను సంప్రదించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. వర్షాలు ప్రారంభమైతే వాగులు, నదుల్లో వరద జలాలు చేరుకొని ఇసుక లభించే పరిస్థితి ఉండదన్నారు. ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయనే ఫిర్యాదులు రాకూడదని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ పాల్గొన్నారు.