HomeతెలంగాణIndiramma housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు: కలెక్టర్​

Indiramma housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు: కలెక్టర్​

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Indiramma housing Scheme | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రుణాలు అందించామని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు.

ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం నుంచి తోడ్పాటును అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా గృహ నిర్మాణం కోసం లబ్ధిదారులైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ (District Rural Development Organization), మెప్మా (Mepma) ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 4,348 మంది లబ్ధిదారులకు రూ. 50.95 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3,916 మందికి రూ.46.59 కోట్లు, మెప్మా ద్వారా 432 మందికి రూ. 4.36 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం మంజూరు చేశామని తెలిపారు.