అక్షరటుడే, బోధన్ : Indiramma Housing Scheme | ఇళ్లు లేని పేదలకు సొంతగూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరుపై కలెక్టర్ స్థాయిలో అధికారులు పథకం అమల తీరును పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ స్థాయి అధికారులు ఇళ్ల కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తన్నారు.
Indiramma Housing Scheme | బోధన్ పట్టణంలో..
బోధన్ పట్టణంలోని 23వ డివిజన్లో ఓ లబ్ధిదారురాలి పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె విదేశాల్లో చదువుకుంటోంది. సదరు లబ్ధిదారురాలు పోలీస్‌శాఖలో (Police Department) పనిచేసే ఓ ఉద్యోగి కూతురు. అయినప్పటికీ ఆ లబ్ధిదారురాలి పేరుతో ఇందిరమ్మ గృహాన్ని అధికారులు మంజూరు చేశారు. ఈ క్రమంలో నాలుగు బిల్లులు కూడా మంజూరైపోయాయి.
ఇందిరమ్మ పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోంది. కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు ఈ పథకాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఓ ప్రభుత్వ ఉద్యోగి (Government Employee) కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
Indiramma Housing Scheme | ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నాం: కమిషనర్
ఈ విషయమై బోధన్ కమిషనర్ జాదవ్ కృష్ణను (Commissioner Jadhav Krishna) వివరణ కోరగా ఎలక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని.. మేనేజర్ రమేష్‌ను కలవాలని సూచించారు. మేనేజర్ రమేష్‌ను సంప్రదించగా ఎలక్షన్ పనుల్లో ఉన్నామని నెల తర్వాత దానిపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.