అక్షరటుడే, బాన్సువాడ: Banswada Sub-Collector | నస్రుల్లాబాద్ మండల పరిధిలో శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Banswada Sub-Collector Kiranmayi) పర్యటించారు. అంకోల్, కామశెట్టిపల్లి, నస్రుల్లాబాద్ గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. కేటాయించిన లబ్ధిదారులు తక్షణమే పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఆలస్యం చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న నిధులు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇళ్ల పనులను పూర్తి చేయడంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గ్రామ స్థాయి అధికారులు (village level officials), సిబ్బందిని సంప్రదించాలని చెప్పారు. గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనులను సక్రమంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.