అక్షరటుడే, ఆర్మూర్: indiramma Housing Scheme | అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) కేటాయించాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు దేవరాం, ఏఐకేఎంఎస్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకుడు ఆకుల గంగారాం డిమాండ్ చేశారు.
ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో (Ankapur village) అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అంకాపూర్ డబుల్ బెడ్రూం స్కీంలో (double bedroom scheme) మొదట పేదల పేర్లు చేర్చి ఇళ్లు పూర్తయ్యాక లబ్ధిదారుల పేర్లు మార్చేయడం ఎంతవరకు సమంజసమని వారు పేర్కొన్నారు.
డబుల్ ఇళ్ల మంజూరులో అవకతవకలను వెలికి తీయాలని.. పేదలకు న్యాయం చేయాలని కోరుతూ మూడు రోజులుగా ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. అధికారులు స్పందించకపోతే దీక్షా శిబిరాన్ని కలెక్టర్ కార్యాలయం అక్కడి నుంచి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్కు మారుస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గౌతమి, రాజమణి, అబ్బమ్మ, సావిత్రి, రమణి, పోసాని, నర్సయ్య, గణేశ్, ప్రజాపంథా ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి కిషన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం డివిజన్ బాధ్యులు రాజన్న, నిఖిల్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
