అక్షరటుడే, ఆర్మూర్ : Indiramma Housing Scheme | మండలంలోని చేపూర్ (Chepur village) గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ముగ్గుపోసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ (Armoor) కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నరెడ్డి, చేపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, సెక్రటరీ హరీష్, రాంసన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బద్దం రాజు, జేసీబీ గంగమోహన్, గంగసాయన్న, వినోద్ కుమార్, నూత్పల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
