అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponnam Prabhakar | ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Prabhakar) సూచించారు. హుస్నాబాద్‌లో ఆయన పలువురికి ఇందిరమ్మ ఇళ్ల (Indiramma house) ప్రోసిడింగ్లు అందించారు.
పొన్నం మాట్లాడుతూ.. సొంతిల్లు అనేది ఎంతో మంది కల అన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల (double-bedroom houses) పేరిట ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎంతమందికి ఇళ్లు వచ్చాయని ప్రశ్నించారు. ‘అహనా పెళ్లంట’ సినిమాలోలాగా కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం మాత్రం అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు.
Minister Ponnam Prabhakar | స్టాచ్యు ఆవిష్కరణ
హుస్నాబాద్ మున్సిపాలిటీ (Husnabad Municipality) ప్రారంభంలో నమస్తే స్టాచ్యును మంత్రి ఆవిష్కరించారు. సిద్దిపేట నుంచి వచ్చే మార్గంలో దీనిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన హుస్నాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తున్న క్రీడాకారుల విగ్రహాలను పరిశీలించారు. కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.