Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme | పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Indiramma Housing Scheme | పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Indiramma Housing Scheme | పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantha Rao) తెలిపారు.. నిజాంసాగర్‌ మండలంలోని మంగ్లూర్​లో పలు ఇందిరమ్మ ఇళ్ల (Indiramm Illu) నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని.. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ ఛైర్మన్‌ (Pitlam AMC Chairman) మనోజ్‌ కుమార్, నిజాంసాగర్‌ మండలాధ్యక్షుడు మల్లికార్జున్, సీనియర్‌ నాయకులు రాంరెడ్డి, అబ్దుల్‌ ఇమ్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

లింగంపల్లిలోని కుర్దులో..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట (Lingampet) మండలం లింగంపల్లి కుర్దులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నరేష్‌ (MPDO Naresh) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కాశీరాం యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు శేఖర్, కార్యదర్శి భవాని, మాజీ సర్పంచ్‌ సురేందర్‌ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

లింగంపల్లి కుర్దులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేస్తున్న ఎంపీడీవో నరేశ్​

Must Read
Related News