అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma House) దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాజు(armoor Municipal Commissioner Raju) ఆధ్వర్యంలో సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లారు. దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితి, అర్హతలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ పథకం వర్తింపు చేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్లు కిరణ్, కిషన్, ఆయా వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
