అక్షరటుడే, నిజాంసాగర్: Indiramma Housing Scheme | మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో సోమవారం ఎంపీడీవో గంగాధర్ లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇల్లు (Indiramm Illu) మంజూరు పత్రం అందజేసి ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి భీమ్రావు, నాయకులు అనీస్ పటేల్, గాండ్ల రమేష్, కారోబార్ సాయిలు, తదితరులున్నారు.
