అక్షరటడే, నిజామాబాద్ సిటీ : Indira Gandhi Jayanthi | ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేమని నుడా ఛైర్మన్ కేశ వేణు అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి (Indira Gandhi Jayanti) సందర్భంగా జిల్లా, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో (Congress Bhavan) ఇందిరా గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. ముందుగా పులాంగ్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా దేశంలో అనేక మార్పులు తెచ్చి అభివృద్ధికి దోహదపడ్డారన్నారు. ఆమె తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్లే ఈరోజు దేశం ప్రపంచ దేశాల స్థాయిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం, హరిత విప్లవం, గరీబీ హటావో అని నినాదంతో ముందుకువెళ్లిన నాయకురాలు ఇందిరాగాంధీ అని ఆయన పేర్కొన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలని నెహ్రూ ఆశయం మేరకు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తీసుకొచ్చారన్నారు. ఇందిరా గాంధీ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరువలేమన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ (PCC General Secretary Rambhupal), జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, సకినాల శివకుమార్, ప్రమోద్, శోభన్, అవిన్, మీనా, స్వప్న, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
