HomeUncategorizedIndira Gandhi | ఎక్స్​లో ఇందిరాగాంధీ ట్రెండింగ్​.. ఎందుకో తెలుసా?

Indira Gandhi | ఎక్స్​లో ఇందిరాగాంధీ ట్రెండింగ్​.. ఎందుకో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indira Gandhi | భారత్​‌‌ – పాకిస్తాన్​ కాల్పుల విరమణ ceasefire కు అంగీకరించడంతో ప్రస్తుతం నెట్టింట ఇందిరాగాంధీ indira gandhi పై జోరుగా చర్చ నడుస్తోంది. ఎక్స్​లో ఆమె ట్రెండింగ్​లో ఉన్నారు. పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత భారత్​ పాక్​కు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్​ సిందూర్​ చేపట్టిన విషయం తెలిసిందే. పీవోకే, పాక్​లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్​ దాడులు చేసింది. ఈ ఘటలో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించారు.

Indira Gandhi | మనదే పైచేయి అయినా..

భారత్​ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాకిస్తాన్​ భారత్​పై దాడికి దిగింది. డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులతో భారత ప్రజలు, ఎయిర్​బేస్​లు, ఎయిర్​పోర్టులే లక్ష్యంగా దాడులు యత్నించింది. అయితే భారత ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థ పాక్​ దాడులను అడ్డుకుంది. పాక్​ డ్రోన్లు, మిసైళ్లను భారత బలగాలు మధ్యలోనూ కూల్చివేశాయి. అంతేగాకుండా భారత్​ ప్రతిదాడులు చేపట్టి పాక్​లోని పలు ఆర్మీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత్​దే పైచేయిగా ఉన్న సమయంలో కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.

Indira Gandhi | ధీరవనిత ఇందిరా..

ప్రస్తుత దాడుల సమయంలో భారత్​ సరైన ప్రణాళికతోనే ముందుకు వెళ్లింది. పాక్​ దాడులను తిప్పి కొట్టడంతో పాటు ఆ దేశంలోని పలు మిలిటరి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అసలే ఆర్థిక సంక్షోభం ఉన్న పాక్​ యుద్ధం చేసే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో భారత్​ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందని పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1971 యుద్ధం సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ పాక్​ పీచమణిచి బంగ్లాదేశ్​కు స్వాతంత్ర్యం ఇచ్చిన విషయాన్ని సోషల్​ మీడియాలో గుర్తు చేస్తున్నారు. ధీర వనిత ఇందిరా గాంధీ అంటూ పోస్టులు పెడుతున్నారు.

నాడు ఆమె పాకిస్తాన్​కు సాయం చేసే దేశాలను హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పెద్ద దేశాలు తమకు ఆదేశాలు జారీ చేయాలనే దుస్సహసం చేయొద్దని ఆమె అప్పుడు హెచ్చరించారు. అప్పుడే ఇందిరా గాంధీ పాక్​ ఆట కట్టించారని, ప్రస్తుతం మంచి అవకాశాన్ని భారత్​ వదులుకుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Indira Gandhi | పాక్​, చైనా వక్ర బుద్ధి

కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్​ మళ్లీ వక్రబుద్ధి చూపెట్టింది. కుక్క తోక వంకర అన్నట్లు శనివారం రాత్రి డ్రోన్లతో దాడులు చేపట్టింది. మరోవైపు నియంత్రణరేఖ వెంబడి కాల్పులు జరిపింది. ఈ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి. పాక్​ దాడులపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పాక్​ బాధ్యత వహించాల్సి ఉంటున్నారు. భారత్​ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మరోవైపు చైనా సైతం పాక్​కు మద్దతు తెలపడం గమనార్హం. పాక్​ భూ భాగాన్ని భారత్​ ఆక్రమిస్తే తాము చూస్తూ ఊరుకోమని చైనా పేర్కొంది. కాగా పాక్​ మళ్లీ దాడులు చేయడంతో భారత్​ యుద్ధం ప్రకటించాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.