ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​IndiGo Flight | 40 నిమిషాలపాటు గాలిలోనే ఇండిగో విమానం చక్కర్లు.. భయం గుప్పిట్లో ప్రయాణికులు..

    IndiGo Flight | 40 నిమిషాలపాటు గాలిలోనే ఇండిగో విమానం చక్కర్లు.. భయం గుప్పిట్లో ప్రయాణికులు..

    Published on

    అక్షరటుడే, తిరుమల: IndiGo Flight | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) లో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. ఇండిగో విమానం (IndiGo plane) సుమారు 40 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య ఏర్పడింది. ఎట్టకేలకు 40 నిమిషాల తర్వాత తిరిగి తిరుపతిలోనే ల్యాండ్ అయింది.

    కాగా, ఈ ఘటన జరిగిన తర్వాత విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎయిర్ పోర్టు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడం ఇందుకు కారణం. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లకు తోడు విమానాశ్రయంలో తదుపరి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

    IndiGo Flight | ఇటీవలే..

    ముంబయి(MUMBAI)లో ఇలాంటి ఘటనే ఇటీవల చోటుచేసుకుంది. ఇండిగో విమానానికి చెందిన ఇంజిన్​ గాలిలో ఉండగానే ఫెయిల్ అయ్యింది. దీంతో ప్రయాణికులు భయంతో గుండెను అరచేతిలో పట్టుకున్నంత పనిచేశారు. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

    కాగా, అప్రమత్తమైన పైలట్.. ప్యాన్ ప్యాన్ ప్యాన్.. అని ఏటీసీకి సందేశం పంపించాడు. దీని అర్థం.. ప్రాణాపాయం లేదు కానీ, ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాలని పైలట్ పంపే సందేశం. అయితే, ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చింది.

    దీంతో విమానాన్ని వెంటనే పైలట్​ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Chhatrapati Shivaji Maharaj International Airport)లో ఎమర్జెన్సీగా ల్యాండ్​ చేశాడు. అలా ప్రమాదం తప్పింది. కాగా, ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం.

    ఈ విమానం దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టు నుంచి గోవాకు బయలుదేరింది. కాగా, గాలిలో ఉండగానే ఇంజిన్ ఫెయిల్ కావడంతో ముంబయిలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. భువనేశ్వర్​ ఉత్తరాన 100 నాటికల్ మైళ్ల దూరంలో విమానం ఎగురుతున్నప్పుడు ఇంజిన్​ ఫెయిల్​ అయినట్లు అధికారులు తెలిపారు.

    కాగా, అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 282 మంది మరణించారు. వసతి గృహంపై విమానం కుప్పకూలడంతో వైద్య విద్యార్థులు సైతం దుర్మరణం చెందారు.

    ఈ ఘటన తర్వాత విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు వెలుగు చూడటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు ఇటీవల తిరుపతికి వెళ్లే విమానాలు తరచూ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మొన్ననే సాంకేతిక సమస్యతో తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్​ శంషాబాద్​ విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పుడేమో ఏకంగా గాలిలో ఉండగానే ఇండిగో విమానం ప్రయాణికులకు 40 నిమిషాల పాటు చుక్కలు చూపించింది.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్​ పదో...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...