అక్షరటుడే, వెబ్‌డెస్క్: IndiGo Bomb Threat | ఇండిగో విమానాలకు (Indigo Flights) బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. కోల్‌కతా నుంచి షిల్లాంగ్ వెళ్తున్న విమానం, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) శనివారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్ పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రన్‌వేపై ల్యాండ్ కాగానే విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.
IndiGo Bomb Threat | భయపెట్టిన బొమ్మ
విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా దించారు. అనంతరం పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే విమానంలో అనుమానాస్పదంగా బొమ్మ కనిపించడంతో అధికారులు ఆందోళన చెందారు.అందులో బాంబు ఉందేమోనని ప్రత్యేక పరికరాలతో పరీక్షించారు. అనంతరం అందులో ఎలాంటి బాంబు లేదని, ఓ ప్రయాణికుడు దానిని మర్చిపోయినట్లు గుర్తించారు. దీంతో నకిలీ బెదిరింపు మెయిల్ (Fake Threatening Email)గా ప్రకటించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
IndiGo Bomb Threat | కోల్‌కతాలో..
బెంగాల్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఇండిగో విమానం టాయిలెట్ లోపల బాంబు బెదిరింపు ఉన్నట్లు చేతితో రాసిన నోట్ కనిపించింది. కోల్‌కతా నుంచి షిల్లాంగ్ (Kolkata to Shillong)కు వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-7304లో నోట్ బయట పడింది. విమానం బయలుదేరే ముందు సాధారణ తనిఖీల సమయంలో సిబ్బంది ఈ నోట్‌ను కనుగొన్నారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం విమానంలో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపి సోదాలు చేపట్టారు.