HomeతెలంగాణIndiGo flight | గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo flight | గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IndiGo flight : గన్నవరం ఎయిపోర్టు(Gannavaram airport)లో ఇండిగో విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్​ అయింది. సదరు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్​ గుర్తించి ఎమర్జెన్సీగా ల్యాండ్​ చేసినట్లు చెబుతున్నారు. బెంగుళూరు (Bangalore) నుంచి హైదరాబాద్(Hyderabad) వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మరో మాటగా.. హైదరాబాద్​లో ల్యాండ్​ చేసేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి విమానాన్ని దారి మళ్లించినట్లు పేర్కొంటున్నారు. ఈ ఇండిగో విమానంలో ఆ సమయంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్​తో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు.

IndiGo flight : వరుస ఘటనలతో..

అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాద ఘటన తర్వాత విమాన ప్రయాణికులు భయపడిపోతున్నారు. విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఉంటోంది. దీంతో పలువురు విమాన ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు.

Must Read
Related News