HomeUncategorizedIndigo Flight | వైర‌ల్ వీడియో.. విమానాన్ని క‌ద‌ల‌నివ్వ‌కుండా చేసిన తేనె టీగ‌ల గుంపు

Indigo Flight | వైర‌ల్ వీడియో.. విమానాన్ని క‌ద‌ల‌నివ్వ‌కుండా చేసిన తేనె టీగ‌ల గుంపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indigo Flight | సాధార‌ణంగా విమానాలు ఆలస్యమవడానికి కారణం వాతావరణ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఎయిర్‌ ట్రాఫిక్ జామ్ వంటివి ఉంటాయి. కానీ సూరత్ విమానాశ్రయం(Surat Airport)లో చోటు చేసుకున్న ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెగ్యుల‌ర్‌ సమస్యల వ‌ల‌న కాకుండా… ఈసారి తేనె టీగ‌ల వ‌ల‌న విమానం టేకాఫ్ కావ‌డానికి గంట ఆలస్యం అయ్యింది. అతిథుల్లా వచ్చిన తేనె టీగ‌లు కొద్ది సేపు అంద‌రిని భ‌య‌బ్రాంతులకు గురి చేశాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. సూరత్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం(Indigo Flight) (ఫ్లైట్ నంబర్ 6E-784) జులై 7న సాయంత్రం 4:20కి టేకాఫ్ కావాల్సి ఉంది.

Indigo Flight | టేకాఫ్​కు సిద్ధంగా ఉన్న సమయంలో..

ప్రయాణికులందరూ విమానంలోని సీట్లలో కూర్చొని ఉన్నారు. టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో, సిబ్బంది లగేజీ లోడ్ చేసే పని చేస్తుండ‌గా, ఊహించ‌ని ఘటన చోటుచేసుకుంది. అనూహ్య‌ రీతిలో తేనెటీగల గుంపు విమానం లగేజీ డోర్ దగ్గరకు వచ్చింది. దాంతో సిబ్బంది ఆందోళన చెందారు. తేనెటీగలు భారీగా ఉండడంతో సిబ్బంది భయంతో ముందుకెళ్లలేకపోయారు. ముందుగా పొగ ద్వారా వాటిని తరిమేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ ఇంజిన్ రన్‌వే వద్దకు చేరుకుని విమానం ల‌గేజ్ డోర్‌(Airplane Luggage Door)పై నీటిని బ‌లంగా కొట్ట‌డంతో అవి అక్క‌డ నుండి వెళ్లిపోయాయి.

ఈ అనూహ్యపరిణామం వ‌ల‌న సాయంత్రం 4:20 గంటలకు బయల్దేరాల్సిన విమానం, గంటకు పైగా ఆలస్యంతో 5:26 గంటలకు టేకాఫ్ అయింది. ఈ విచిత్ర ఘటనపై ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ .. “తేనెటీగల కారణంగా ఫ్లైట్ ఆలస్యమైంది. ఇది మేము ముందుగా అంచనా వేయలేని పరిణామం. ప్రయాణికుల భద్రతే మాకు ప్రథమం. అవసరమైన అన్ని భద్రతా పరిశీలనలు పూర్తయ్యాకే విమానం బయలుదేరింది అని తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “తేనెటీగలు కూడా ట్రావెల్ చేయాలనుకుంటున్నాయేమో!” అని కొంతమంది కామెంట్లు చేశారు.

Read all the Latest News on Aksharatoday.in

Must Read
Related News