HomeUncategorizedIndigo Flight | వ‌డ‌గండ్ల‌తో ఇండిగో విమానానికి రంధ్రం.. భ‌యంతో తీవ్ర ఆందోళ‌న చెందిన‌ ప్ర‌యాణికులు

Indigo Flight | వ‌డ‌గండ్ల‌తో ఇండిగో విమానానికి రంధ్రం.. భ‌యంతో తీవ్ర ఆందోళ‌న చెందిన‌ ప్ర‌యాణికులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indigo Flight | ఇటీవ‌ల వాతావ‌ర‌ణం(Weather) పూర్తిగా మారిపోయింది. మొన్న‌టి వ‌ర‌కు మండే ఎండ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అయిన ప్ర‌జ‌లు ఇప్పుడు వ‌ర్షాల‌తో చ‌ల్ల‌బ‌డుతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల‌లో వాన‌లు బీభత్సం సృష్టిస్తున్నాయి. వ‌డగండ్లు, తీవ్ర‌మైన గాలులతో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఢిల్లీతో (Delhi) పాటు పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులతో పాటు.. భారీ వడగాళ్ల వాన కురిసింది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం వ‌ల‌న ఇండిగో విమానం(Indigo Flight) పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌పడింది అని చెప్పాలి.

Indigo Flight | ప్ర‌మాదం త‌ప్పింది..

ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 (రిజిస్ట్రీ VT-IMD) మార్గమధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఢిల్లీ, శ్రీనగర్ మధ్య విమానంపై వడగళ్ల వర్షం(Hailstorm) పడ‌డంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. పైలట్ చాకచక్యం ప్రదర్శించాడు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. శ్రీనగర్‌కు Srinagar సమాచారం అందించాడు. శ్రీనగర్ విమానాశ్రయం(Srinagar Airport)లో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. అయితే గాలివానకు విమానం కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగులు, మెరుపుల వెలుగులు ఆ విమానం కిటికీల నుంచి కనిపించడంతో ఒక్కొక్క‌రు అర‌వ‌డం మొద‌లు పెట్టారు.

విమానం తుఫానులో చిక్కుకున్న వెంటనే పైలట్.. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌(Srinagar Air Traffic Control)కు అత్యవసర సమాచారం ఇచ్చాడు. అయితే, అన్ని నిబంధనలను పాటిస్తూ, విమానాన్ని సురక్షితంగా మంగ‌ళ‌వారం సాయంత్రం 6.30 గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేశాడు. చివరకు విమానం (Aeroplane)సురక్షితంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ క్రమంలో విమానం ముందు భాగం దెబ్బతింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై కేకలు వేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.