HomeUncategorizedIndigo | ఇండిగోదే ఆధిపత్యం.. ద్వితీయ స్థానంలో ఎయిర్‌ ఇండియా

Indigo | ఇండిగోదే ఆధిపత్యం.. ద్వితీయ స్థానంలో ఎయిర్‌ ఇండియా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indigo | దేశీయ విమాన రవాణా మార్కెట్‌లో ఇండిగో (Indigo) ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌ ఇండియా (Air India) గణనీయమైన పురోగతిని సాధిస్తూ సవాల్‌ విసురుతోంది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) విడుదల చేసిన ఏప్రిల్‌ డాటా ప్రకారం దేశీయ విమాన రవాణా మార్కెట్‌లో ఇండిగో 64.1 శాతం వాటాతో అందనంత ఎత్తులో ఉంది. ఈ సంస్థ 430 విమానాలను కలిగి ఉంది. దేశంలోని వివిధ రూట్లనుంచి విస్తృతమైన సేవలను అందిస్తోంది. తన విస్తృతమైన నెట్‌వర్క్‌, సమయపాలనతో మార్కెట్‌లో ఆధిపత్యం కొనసాగిస్తోంది.

టాటా గ్రూప్‌ (Tata group) ఎయిర్‌ ఇండియాను సొంతం చేసుకున్న తర్వాత దేశీయ విమాన రవాణా రంగంలో బలమైన పోటీదారుగా మారింది. ప్రస్తుతం ఈ కంపెనీ 27.2 శాతం మార్కెట్‌ షేర్‌ను కలిగి ఉంది. ఎయిర్‌ ఇండియా వద్ద 300 విమానాలున్నాయి. సేవలలో నాణ్యతను మెరుగుపరచుకోవడం, కొత్త విమానాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మార్కెట్‌ వాటా పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఐదు శాతం వాటాతో ఆకాశ ఎయిర్‌(Akasa Air) మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 30 విమానాలను నడుపుతోంది. ఆధునిక విమానాలు, కస్టమర్‌ సెంట్రిక్‌ విధానంతో ప్రధానంగా మెట్రో నగరాలలో కస్టమర్ల ఆదరణను చూరగొంటోంది.

స్పైస్‌జెట్‌(SpiceJet) 2.6 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉంది. ఈ కంపెనీ 60 విమానాలను నడుపుతోంది. అలయన్స్‌ ఎయిర్‌(Alliance Air), స్టార్‌ ఎయిర్‌(Star Air) వంటి ఇతర చిన్న విమానయాన సంస్థలు సైతం దేశీయ విమాన రవాణా రంగంలో సేవలందిస్తున్నా వాటి పాత్ర నామమాత్రంగా ఉంది.