అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indigo Crisis | ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) సంక్షోభంతో ఇటీవల అనేక విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో తాజాగా డీజీసీఏ చర్యలు చేపట్టింది. నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ల (Flight Operations Inspectors)ను సస్పెండ్ చేసింది.
ఎఫ్డీటీఎల్ నిబంధనల అమలు సాకుతో ఇటీవల ఇండిగో వేలాది విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్నారు. అయితే కేంద్రం, డీజీసీఏ చర్యలతో పరిస్థితి మెరుగు పడింది. అయితే విమానాల రద్దు మాత్రం ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్క రోజే బెంగళూరు విమానాశ్రయం (Bangalore Airport)లో 50 కి పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.
Indigo Crisis | ఎఫ్వోఐ సస్పెన్షన్
ఇండిగో సంక్షోభం వేళ డీజీసీఏ నలుగురు ఫ్లైట్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ల (FOI)లను సస్పెండ్ చేసింది. ఎఫ్ఓఐలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోని సీనియర్ అధికారులు (Senior Officers), నియంత్రణ, భద్రతా పర్యవేక్షణకు బాధ్యత వహిస్తారు. విమానయాన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి వారిని నియమిస్తారు. అయితే ఇండిగో విమానాల (IndiGo Flight) రద్దు సమయంలో వారు విధుల్లో నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ సస్పెండ్ చేసింది.
పైలట్లు, డిస్పాచర్‌లు, క్యాబిన్ సిబ్బందితో సహా విమానయాన సంస్థలు, సిబ్బంది తనిఖీలు, ఆడిట్లు నిర్వహించడం ఎఫ్వోఐల పని. విమానయాన భద్రతలో వీరి పాత్ర కీలకం. నియంత్రణ సమ్మతిని ధృవీకరించడం, శిక్షణ, విమాన ప్రమాణాలను పర్యవేక్షించడం, ప్రమాద నివారణ ప్రయత్నాలకు తోడ్పడటం చేస్తుంటారు. అయితే ఒకేసారి భారీ మొత్తంలో విమానాలు రద్దు అయినా.. నలుగురు ఎఫ్వోఐలు సరైన చర్యలు చేపట్టలేదని డీజీసీఏ గుర్తించింది. ఈ మేరకు వారిపై వేటు వేసింది.