అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | కీలకమైన ట్రంప్, పుతిన్(Putin) భేటీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో స్వల్ప ఒడిదుడుకుల మధ్య సూచీలు సాగుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్(Sensex) 86 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా కొద్దిసేపటికి 136 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత పుంజుకుని 262 పాయింట్లు పెరిగింది. 12 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ అక్కడినుంచి 69 పాయింట్లు పెరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 172 పాయింట్ల లాభంతో 80,712 వద్ద, నిఫ్టీ(Nifty) 41 పాయింట్ల లాభంతో 24,661 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | ఐటీలో కొనుగోళ్ల మద్దతు..
మెటల్(Metal), పవర్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతుండగా.. ఐటీలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 1.52 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank) 0.31 శాతం, బ్యాంకెక్స్ 0.32 శాతం లాభాలతో ఉన్నాయి. మెటల్ ఇండెక్స్ 1.35 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకశాతం, ఎనర్జీ 0.79 శాతం, రియాలిటీ 0.63 శాతం, కమోడిటీ 0.64 శాతం, ఇన్‌ఫ్రా, పీఎస్‌యూ ఇండెక్స్‌లు 0.55 శాతం నష్టాలతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 0.29 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.11 శాతం నష్టాలతో ఉండగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.10 శాతం లాభంతో ఉంది.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఇన్ఫోసిస్ 2.76 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.87 శాతం, టెక్ మహీంద్రా 0.61 శాతం, ఎస్‌బీఐ 0.57 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.50 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా స్టీల్ 1.90 శాతం, బీఈఎల్ 1.32 శాతం, అదాని పోర్ట్స్ 0.89 శాతం, ఎల్‌టీ 0.86 శాతం, ఎన్టీపీసీ 0.85 శాతం నష్టాలతో ఉన్నాయి.