అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | జీఎస్టీ సరళీకరణతో భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్(Profit booking)కు దిగడంతో చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 889 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.
అయితే గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ప్రారంభ లాభాలు ఆవిరై ఇంట్రాడే గరిష్టాలనుంచి 848 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ(Nifty) 265 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేక ఇంట్రాడే గరిష్టాలనుంచి 272 పాయింట్లు నష్టపోయి ఓ దశలో నష్టాల్లోకి జారుకుంది. చివరికి సెన్సెక్స్(Sensex) 150 పాయింట్ల లాభంతో 80,718 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 24,734 వద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,809 కంపెనీలు లాభపడగా 2,325 స్టాక్స్ నష్టపోయాయి. 146 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 141కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 50 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్(Lower circuit)ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 1.92 లక్షల కోట్లమేర తగ్గింది.
Stock Markets | మిడ్, స్మాల్ క్యాప్‌లో భారీ నష్టాలు..
ఆటో, ఎఫ్‌ఎంసీజీ(FMCG) మినహా ప్రధాన సెక్టార్ల స్టాక్స్ రాణించలేదు. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్(Auto index) 0.69 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.31 శాతం, ఫినాన్షియల్ సర్వీసెస్ 0.15 శాతం లాభపడ్డాయి. యుటిలిటీ ఇండెక్స్ 1.29 శాతం పడిపోగా.. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.18 శాతం, పీఎస్‌యూ 1.07 శాతం, ఇన్‌ఫ్రా, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 1.05 శాతం, ఐటీ 0.97 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.84 శాతం, రియాలిటీ 0.79 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.77 శాతం నష్టపోయాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 0.60 శాతం నష్టపోగా.. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో, 19 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎంఅండ్‌ఎం 5.96 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.28 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.98 శాతం, ట్రెంట్ 1.35 శాతం, ఐటీసీ 1.02 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
మారుతి 1.78 శాతం, బీఈఎల్ 1.61 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 1.57 శాతం, ఎన్టీపీసీ 1.24 శాతం, పవర్‌గ్రిడ్ 1.19 శాతం నష్టపోయాయి.