Homeబిజినెస్​Stock Market | నష్టాలతో ముగిసిన సూచీలు.. రూ. 4.73 లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock Market | నష్టాలతో ముగిసిన సూచీలు.. రూ. 4.73 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై మెల్లగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 148 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయాయి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) ఫ్లాట్‌గా ప్రారంభమై నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 148 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయాయి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌(Mid cap) స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి.

ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ (Asian Markets) లాభాలతో ముగియగా.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 57 పాయింట్ల లాభంతో, నిఫ్టీ(Nifty) 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 83,237 నుంచి 83,846 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,491 నుంచి 25,679 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 148 పాయింట్ల నష్టంతో 83,311 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 25,509 వద్ద స్థిరపడ్డాయి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ(Profit booking)కు ప్రాధాన్యత ఇస్తుండడంతో సూచీలు గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేకపోతున్నాయి.

ఐటీ మినహా అన్ని రంగాల్లో సెల్లాఫ్‌..

ఐటీ(IT) మినహా మిగతా అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాలను చవిచూశాయి. మెటల్‌, పవర్‌, కమోడిటీ తదిరత రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.13 శాతం పెరిగింది. యుటిలిటీ ఇండెక్స్‌ 2.20 శాతం, మెటల్‌(Metal) ఇండెక్స్‌ 2.03 శాతం, పవర్‌ 1.96 శాతం, కమోడిటీ 1.76 శాతం, రియాలిటీ 1.51 శాతం, ఇండస్ట్రియల్‌ 1.47 శాతం, ఇన్‌ఫ్రా 1.41 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.26 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.25 శాతం, టెలికాం 1.20 శాతం పడిపోయాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 1.53 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.19 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.49 శాతం నష్టపోయాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,202 కంపెనీలు లాభపడగా 3,012 స్టాక్స్‌ నష్టపోయాయి. 139 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 124 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 173 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఈఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 4.72 లక్షల కోట్ల మేర తగ్గింది.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో ఉండగా.. 19 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఆసియా పెయింట్‌ 4.76 శాతం, రిలయన్స్‌ 1.62 శాతం, ఎంఅండ్‌ఎం 1.02 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.00 శాతం, టీసీఎస్‌ 0.71 శాతం లాభపడ్డాయి.

Top Losers : పవర్‌గ్రిడ్‌ 3.15 శాతం, ఎటర్నల్‌ 2.44 శాతం, బీఈఎల్‌ 1.67 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.45 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.21 శాతం నష్టపోయాయి.