Homeబిజినెస్​Stock Market | నష్టాలతో ముగిసిన సూచీలు

Stock Market | నష్టాలతో ముగిసిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | యూఎస్‌ వాణిజ్య సుంకాల పాజ్‌ గడువు సమీపిస్తుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock markets) నష్టాలతో ముగిసింది. బుధవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 93 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో మరో 145 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి క్రమంగా పడిపోతూ 787 పాయింట్లు నష్టపోయింది. 47 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. మరో 20 పాయింట్లు మాత్రమే పెరిగింది. గరిష్ట స్థాయి నుంచి 230 పాయింట్ల వరకు తగ్గింది. చివరికి సెన్సెక్స్‌ 287 పాయింట్ల నష్టంతో 83,409 వద్ద, నిఫ్టీ(Nifty) 88 పాయింట్ల నష్టంతో 25,453 వద్ద స్థిరపడ్డాయి.

యూఎస్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన గడువు ఈనెల 9వ తేదీతో ముగియనుంది. ఒప్పందం చేసుకోని దేశాలతో కఠినంగా వ్యవహరిస్తానన్న ట్రంప్‌(Trump) ప్రకటనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. అలాగే ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లాభాలను స్వీకరించడానికిే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో సూచీలు పడిపోయాయి. బజాజ్‌ ట్విన్స్‌(Bajaj twins)తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ వంటి స్టాక్స్‌ భారీగా పడిపోవడం సూచీలపై మరింత ప్రభావం చూపింది.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,809 కంపెనీలు లాభపడగా 2.205 స్టాక్స్‌ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 145 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 51 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Stock Market | అమ్మకాల ఒత్తిడి..

బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 1.44 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 1.22 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 0.90 శాతం, టెలికాం 0.55 శాతం, ఆటో సూచీ 0.22 శాతం లాభాలతో ముగిశాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.36 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.92 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 0.82 శాతం, పవర్‌ సూచీ 0.77 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంకెక్స్‌ 0.69 శాతం, ఇన్‌ఫ్రా 0.64 శాతం నష్టపోయాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.22 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.18 శాతం నష్టాలతో ముగిశాయి.

Top gainers:బీఎస్‌ఈలో 14 కంపెనీలు లాభాలతో 16 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా స్టీల్‌ 3.72 శాతం, ఆసియా పెయింట్స్‌ 2.15 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.60 శాతం, ట్రెంట్‌ 1.43 శాతం, ఎన్టీపీసీ 0.72 శాతం, మారుతి 1.38 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers:బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.10 శాతం, ఎల్‌టీ 1.89 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.48 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.30 శాతం, బీఈఎల్‌ 1.04 శాతం నష్టాలతో ముగిశాయి.

Must Read
Related News