అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) లాభాల బాటలో సాగింది. వరుసగా రెండో సెషన్లోనూ ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో నిఫ్టీ మరోసారి 26 వేల మార్క్‌ను దాటింది.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 233 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 231 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో 326 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 173 పాయింట్ల లాభంతో మొదలై 67 పాయింట్లు లాభపడిరది. అక్కడినుంచి 100 పాయింట్లు కోల్పోయింది. తర్వాత క్రమంగా పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 449 పాయింట్ల లాభంతో 85,267 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 26,046 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,593 కంపెనీలు లాభపడగా 1,593స్టాక్స్ నష్టపోయాయి. 170 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 95 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 96 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
ఎఫ్ఎంసీజీ మినహా..
బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. మెటల్ ఇండెక్స్ 2.58 శాతం, కమోడిటీ 1.84 శాతం, రియాలిటీ 1.47 శాతం, సర్వీసెస్ 1.34 శాతం, టెలికాం 1.27 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.21 శాతం, యుటిలిటీ 1.04 శాతం, ఇండస్ట్రియల్ 1 శాతం, పవర్ 0.99 శాతం, ఎనర్జీ, ఇన్ఫ్రా ఇండెక్స్‌లు 0.97 శాతం పెరిగాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.08 శాతం నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం లాభంతో ముగిశాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో ఉండగా.. 7 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్ 3.34 శాతం, ఎటర్నల్ 2.37 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.35 శాతం, ఎల్టీ 1.71 శాతం, మారుతి 1.51 శాతం లాభపడ్డాయి.
Top Losers : హెచ్‌యూఎల్ 1.89 శాతం, సన్‌ఫార్మా 1.89 శాతం, ఐటీసీ 0.63 శాతం, ఆసియా పెయింట్ 0.57 శాతం, పవర్‌గ్రిడ్ 0.36 శాతం నష్టపోయాయి.