అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం 82 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. తొలుత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని 240 పాయింట్లకుపైగా నష్టపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకుంది. ఇంట్రాడే కనిష్టాలనుంచి క్రమంగా 475 పాయింట్లు పెరిగింది. చివరికి 123 పాయింట్ల లాభంతో 82,515 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(Nifty) 30 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా.. వెంటనే 83 పాయింట్లు నష్టపోయింది. తర్వాత కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 141 పాయింట్లు పెరిగింది. ట్రేడింగ్(Trading) ముగిసే సమయానికి 37 పాయింట్ల లాభంతో 25,141 వద్ద ఉంది. ఐటీ స్టాక్స్‌తోపాటు రిలయన్స్ ప్రధాన సూచీలను పైకి తీసుకువెళ్లగా.. పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ(FMCG) స్టాక్స్ నష్టపోయాయి. వివిధ దేశాల మధ్య వాణిజ్య చర్చలతో మార్కెట్లు పాజిటివ్‌గా కొనసాగాయి. జూలై 9 లోపే యూఎస్‌తో స్వల్ప కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండడం మార్కెట్ సెంటిమెంట్‌ను నిలబెట్టింది.
బీఎస్‌ఈ(BSE)లో 2,227 కంపెనీలు లాభపడగా 1,821 స్టాక్స్ నష్టపోయాయి. 132 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 122 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 36 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 5 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | ఆయిల్ అండ్ గ్యాన్ షేర్లలో ర్యాలీ..
బీఎస్‌ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్(Oil and Gas index) 1.83 శాతం లాభపడిరది. ఎనర్జీ సూచీ 1.33 శాతం, ఐటీ 1.30 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.74 శాతం పెరిగింది. పీఎస్‌యూ బ్యాంక్స్ ఎక్కువగా నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.94 శాతం పడిపోగా.. పవర్ ఇండెక్స్ 0.81 శాతం, ఎఫ్‌ంఎసీజీ 0.56 శాతం, క్యాపిటల్ గూడ్స్ సూచీ 0.42 శాతం నష్టపోయాయి. లార్జ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు స్వల్ప లాభాలతో ముగియగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం పడిపోయింది.
Stock Market | Top 5 gainers..
బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో జీటీఎల్ ఇన్‌ఫ్రా(GTL infra) 19.74 శాతం పెరగ్గా… వోక్‌హార్డ్ట్(Wockhardt) 18.36 శాతం, ధని సర్వీసెస్ 15.38 శాతం, వీఐపీ ఇండస్ట్రీస్ 11.41 శాతం, రత్తన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ 10.82 శాతం లాభపడ్డాయి.
Stock Market | Top 5 losers..
ఐఈఎక్స్(IEX) 7.72 శాతం, యునైటెడ్ స్పిరిట్ 6.63 శాతం, డీసీఎక్స్ సిస్టమ్స్ 5.58 శాతం, ఇంజినీర్స్ ఇండియా 5.19 శాతం, తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ 4.83 శాతం నష్టపోయాయి.