Homeబిజినెస్​Stock Market | లాభాల్లో ముగిసిన సూచీలు

Stock Market | లాభాల్లో ముగిసిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock market) బుధవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగినా చివరి గంటలో కోలుకుని లాభాలతో ముగిశాయి. ఉదయం 130 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 543 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ(Nifty) 35 పాయింట్ల లాభంతో ప్రారంభమై గరిష్టంగా 189 పాయింట్లు పెరిగింది. యూఎస్‌- చైనాల మధ్య సుంకాల తగ్గింపునకు కుదిరిన ఒప్పందంతో ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాలకు పాల్పడే అవకాశాలు ఉండడంతో మన మార్కెట్లు కొంత ఒత్తిడికి గురయ్యాయి. బ్యాంకింగ్‌(Banking) స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి గురైనా మెటల్‌, రియాలిటీ, డిఫెన్స్‌, ఐటీ(IT) స్టాక్స్‌ రాణించాయి. దీంతో చివరికి సెన్సెక్స్‌ 182 పాయింట్ల లాభంతో 81,330 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 24,566 వద్ద ముగిశాయి.
బీఎస్‌ఈ(BSE)లో 2,855 కంపెనీలు లాభపడగా 1,121 స్టాక్స్‌ మాత్రమే నష్టపోయాయి. 149 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 88 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 30 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 3 లక్షల కోట్లకుపైగా పెరిగింది.

Stock Market | రాణించిన స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌

బ్యాంకింగ్‌ మినహా మిగతా అన్ని రంగాలూ రాణించాయి. స్మాల్‌(Small), మిడ్‌ క్యాప్‌ స్టాక్ట్‌ విశేషంగా రాణిస్తున్నాయి. బుధవారం స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.63 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Mid cap index) 1.19 శాతం పెరగ్గా.. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.40 శాతం లాభపడింది. మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.46 శాతం పెరిగింది. రియాలిటీ(Realty) 1.71 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.49 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 1.46 శాతం, ఐటీ ఇండెక్స్‌ 1.38 శాతం, ఎనర్జీ 1.23 శాతం, టెలికాం 1.14 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.07 శాతం పెరిగాయి. ఇన్‌ఫ్రా, ఆటో, హెల్త్‌కేర్‌ రంగాలూ రాణించాయి. బ్యాంకెక్స్‌(Bankex) మాత్రమే 0.34 శాతం నష్టపోయింది.

Top Gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 9 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా స్టీల్‌(Tata steel) 3.88 శాతం లాభపడిరది. ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా రెండు శాతానికిపైగా పెరగ్గా.. ఎంఅండ్‌ఎం, మారుతి(Maruti), ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఒక శాతానికిపైగా పెరిగాయి.

Top Losers..

ఆసియా పెయింట్‌(Asia paint) అత్యధికంగా 1.78 శాతం నష్టపోగా.. టాటా మోటార్స్‌, కొటక్‌ బ్యాంక్‌ ఒక శాతానికిపైగా పడిపోయాయి. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC bank) అర శాతానికిపైగా తగ్గాయి.