అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) నష్టాల బాటలోనే సాగుతున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 321 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతరాయంగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడం, రూపాయి విలువ బలహీనపడుతూనే ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 153 పాయింట్లు పెరిగింది. ప్రాఫిట్ బుకింగ్‌తో ఇంట్రాడే గరిష్టాల నుంచి 246 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 21 పాయింట్ల నష్టంతో ప్రారంభమై, 23 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 86 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 321 పాయింట్ల నష్టంతో 85,086 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 26,052 వద్ద ఉన్నాయి.
ఐటీలో ఆగని అమ్మకాలు..
ఐటీ సెక్టార్లో వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలు కొనసాగుతున్నాయి. బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 0.76 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.49 శాతం, ఆటో 0.48 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.43 శాతం నష్టాలతో ఉన్నాయి. ఇన్ఫ్రా 1.15 శాతం, పీఎస్‌యూ 0.71 శాతం, యుటిలిటీ 0.55 శాతం, పవర్ ఇండెక్స్ 0.48 శాతం లాభంతో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం లాభంతో ఉండగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.03 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టైటాన్ 1.48 శాతం, బీఈఎల్ 1.06 శాతం, ఎన్టీపీసీ 0.73 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.65 శాతం, పవర్‌గ్రిడ్ 0.21 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : సన్‌ఫార్మా 1.63 శాతం, టీఎంపీవీ 1.13 శాతం, టీసీఎస్ 1.09 శాతం, టెక్ మహీంద్రా 1.09 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.06 శాతం నష్టాలతో ఉన్నాయి.