ePaper
More
    Homeబిజినెస్​Stock Market | మార్కెట్‌ క్రాష్‌ నుంచి కోలుకుంటున్న సూచీలు

    Stock Market | మార్కెట్‌ క్రాష్‌ నుంచి కోలుకుంటున్న సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | స్టాక్‌ మార్కెట్లు(Stock markets) శుక్రవారం క్రాష్‌ అయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అశాంతితో క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధరలకు రెక్కలొచ్చాయి. యుద్ధభయాలతో గ్లోబల్‌ మార్కెట్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో అన్ని మార్కెట్లు నష్టాలలో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే ప్రారంభంలో ఎదురైన భారీ నష్టాల నుంచి మెల్లగా కోలుకుంటున్నాయి.

    గ్లోబల్ మార్కెట్లను అనుసరిస్తూ మన మార్కెట్లు సైతం శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 1,264 పాయింట్ల నష్టంతో ప్రారంభమవగా.. నిఫ్టీ(NIfty) 415 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పతనం ఆగిపోయి క్రమంగా పైకి ఎగబాకాయి. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 664 పాయింట్ల నష్టంతో 81.027 వద్ద, నిఫ్టీ 203 పాయింట్ల నష్టంతో 24,685 వద్ద కొనసాగుతున్నాయి.

    Stock Market | అన్ని రంగాల్లో సెల్లాఫ్..

    జియో పొలిటికల్‌ టెన్షన్స్‌(Geo political tensions)తో ఐటీ మినహా మిగతా అన్ని రంగాల స్టాక్స్‌ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.22 శాతం లాభంతో కదలాడుతోంది. పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) ఇండెక్స్‌ 1.75 శాతం మేర పతనమైంది. బ్యాంకెక్స్‌ 1.11 శాతం, ఇన్‌ఫ్రా 1.09 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.98 శాతం, పవర్‌ సూచీ 0.96 శాతం నష్టంతో ఉన్నాయి. ఆటో, కన్జూమర్‌ డ్యూరెబుల్‌, మెటల్‌, ఎనర్జీ, పీఎస్‌యూ, టెలికాం ఇండెక్స్‌లూ భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 0.83 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.49 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.37 శాతం నష్టాలతో ఉన్నాయి.

    Stock Market | Gainers..

    బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 4 స్టాక్స్‌ మాత్రమే లాభాలతో ఉండగా 26 స్టాక్స్‌ నష్టాలతో కొనసాగుతున్నాయి. టెక్‌మహీంద్రా(Tech Mahindra) 0.84 శాతం, సన్‌ఫార్మా 0.37 శాతం, టీసీఎస్‌ 0.18 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.09 శాతం లాభంతో కదలాడుతున్నాయి.

    Stock Market | Top losers..

    అదానీ పోర్ట్స్‌(Adani ports) 2.70 శాతం, ఎస్‌బీఐ 1.82 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.65 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.61 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.42 శాతం నష్టాలతో ఉన్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...