Homeబిజినెస్​Stock Market | భారీ లాభాల దిశగా సూచీలు.. 26 వేల మార్క్‌పైన నిలబడిన నిఫ్టీ

Stock Market | భారీ లాభాల దిశగా సూచీలు.. 26 వేల మార్క్‌పైన నిలబడిన నిఫ్టీ

ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతో మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా సాగుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఆసియా మార్కెట్లు (Asian Markets) ఎక్కువగా లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా సాగుతున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 410 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 146 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

భారత్‌తో వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) చేసిన తాజా వ్యాఖ్యలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచాయి. ట్రేడ్‌ డీల్‌ (Trade deal) కుదిరితే ఎగుమతి సుంకాల భారం తగ్గే అవకాశాలు ఉండడం.. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సానుకూల ప్రకటన చేయడం, గత సెషన్‌లో ఎఫ్‌ఐఐ(FII)లు భారీగా కొనుగోళ్లకు పాల్పడడంతో మన సూచీలు పరుగులు తీస్తున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 35 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 84,638 నుంచి 85,002 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 25,960 నుంచి 26,064 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 357 పాయింట్ల లాభంతో 84,986 వద్ద, నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 26,061 ఉన్నాయి.

పవర్‌, మెటల్‌ స్టాక్స్‌లో బుల్‌ జోరు..

బీఎస్‌ఈలో యుటిలిటీ(Utility) 2.59 శాతం, పవర్‌ 2.25 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 2.04 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 1.86 శాతం, ఎనర్జీ 1.61 శాం, ఇన్‌ఫ్రా 1.55 శాతం, పీఎస్‌యూ 1.20 శాతం, కమోడిటీ(Commodity) 1.11 శాతం లాభంతో ఉన్నాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ 1.28 శాతం, ఆటో 0.14 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 0.10 శాతం నష్టంతో ఉన్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.44 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.28 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.20 శాతం లాభంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో ఉండగా.. 9 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
అదాని పోర్ట్స్‌ 2.61 శాతం, ఎన్టీపీసీ 2.49 శాతం, పవర్‌ గ్రిడ్‌ 2.22 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.04 శాతం, టాటా స్టీల్‌ 1.95 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎటర్నల్‌ 1.21 శాతం, బీఈఎల్‌ 1.17 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.15 శాతం, ఎంఅండ్‌ఎం 0.63 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.50 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.52 శాతం నష్టాలతో ఉన్నాయి.