అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | యూఎస్ ద్రవ్యోల్బణం(US inflation) తగ్గడంతో ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్‌లో మరింతగా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని వాల్‌స్ట్రీట్ అంచనా వేస్తోంది. దీనికితోడు టెక్ స్టాక్స్ తిరిగి పుంజుకోవడంతో వాల్‌స్ట్రీట్(Wallstreet) గత సెషన్లో భారీ లాభాలతో ముగిసింది.
యూఎస్‌లో తక్కువ వడ్డీ రేట్లు ఉంటే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెట్టుబడులు తరలివచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని మన మార్కెట్లు పాజిటివ్‌గా తీసుకుని లాభాల బాటలో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో స్వల్ప ఒడిదుడుకులకు లోనై 22 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని మరో 333 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 96 పాయింట్ల లాభంతో మొదలై 31 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి 99 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 469 పాయింట్ల లాభంతో 84,951 వద్ద, నిఫ్టీ 134 పాయింట్ల లాభంతో 25,949 వద్ద ఉన్నాయి.
Stock Markets | ఆటో, హెల్త్‌కేర్‌లో కొనుగోళ్ల మద్దతు..
మెటల్ సెక్టార్లో లాభాల స్వీకరణ జరుగుతుండగా.. ఆటో(Auto), హెల్త్‌కేర్‌లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బీఎస్ఈ(BSE)లో హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.81 శాతం, ఆటో ఇండెక్స్ 0.75 శాతం, ఎనర్జీ 0.71 శాతం, ఇండస్ట్రియల్ 0.70 శాతం, ఐటీ ఇండెక్స్ 0.55 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.53 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.52 శాతం, ఇన్ఫ్రా(Infra) 0.49 శాతం, రియాలిటీ 0.41 శాతం లాభాలతో ఉండగా.. క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 0.61 శాతం, మెటల్ 0.44 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.15 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం లాభంతో ఉన్నాయి.
Stock Markets | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 25 కంపెనీలు లాభాలతో ఉండగా.. 5 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. రిలయన్స్ 1.86 శాతం, బీఈఎల్ 1.81 శాతం, టీఎంపీవీ 1.53 శాతం, ఇన్ఫోసిస్ 1.40 శాతం, ఎల్టీ 1.09 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Markets | losers..
హెచ్‌సీఎల్ టెక్ 0.98 శాతం, ఎన్టీపీసీ 0.22 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.13 శాతం, టాటా స్టీల్ 0.09 శాతం, టెక్ మహీంద్రా 0.06 శాతం నష్టాలతో ఉన్నాయి.