అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) నష్టాల బాటలో పయనిస్తోంది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 33 పాయిట్లు పెరిగినా.. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 452 పడిపోయింది. నిఫ్టీ (Nifty) 42 పాయింట్ల లాభంతో మొదలై మరో 27 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 140 పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 216 పాయింట్ల నష్టంతో 84,463 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 25,790 వద్ద ఉన్నాయి.
మిశ్రమంగా సూచీలు..
బీఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.39 శాతం, మెటల్ 0.46 శాతం, పీఎస్‌యూ 0.37 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.36 శాతం, ఎనర్జీ 028 శాతం, ఐటీ ఇండెక్స్ 0.26 శాతం పెరిగాయి. కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.82 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.80 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.60 శాతం, ఇండస్ట్రియల్ 0.53 శాతం, రియాలిటీ 0.45 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.48 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం లాభంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో ఉండగా.. 17 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.ఎస్బీఐ 1.47 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.80 శాతం, పవర్‌గ్రిడ్ 0.79 శాతం, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ 0.59 శాతం, ఎటర్నల్ 0.56 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఐసీఐసీఐ బ్యాంక్ 1.17 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.15 శాతం, ట్రెంట్ 1.10 శాతం, అదానిపోర్ట్స్ 0.98 శాతం, టైటాన్ 0.89 శాతం నష్టాలతో ఉన్నాయి.