అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | గ్లోబల్ మార్కెట్లు (Global markets) ప్రతికూలంగా ఉండడం, రూపాయి పతనం ఆగకపోవడం, ఎఫ్ఐఐ(FII)ల అమ్మకాలు కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బై ఆన్ డిప్స్ పద్ధతిని పాటిస్తూ కనిష్టాల వద్ద కొనుగోలు చేస్తూ గరిష్టాల వద్ద అమ్మకాలకు పాల్పడుతున్నారు.
దీంతో మార్కెట్లు రేంజ్ బౌండ్లో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 326 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 51 పాయిట్లు కోల్పోయింది కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని 316 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 116 పాయింట్ల నష్టంతో మొదలై మరో 26 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 103 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 85,065 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 25,978 వద్ద ఉన్నాయి.
Stock Market | మిశ్రమంగా..
బీఎస్ఈ(BSE)లో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.45 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.39 శాతం, ఐటీ 0.26 శాతం, ఇన్ఫ్రా 0.12 శాతం లాభాలతో ఉన్నాయి. ఆటో(Auto) ఇండెక్స్ 0.88 శాతం, రియాలిటీ 0.66 శాతం, టెలికాం 0.63 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.62 శాతం, హెల్త్‌కేర్ 0.51 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.34 శాతం నష్టాలతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 0.29 శాతం లాభంతో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం నష్టంతో ఉన్నాయి.
Stock Market | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో ఉండగా.. 20 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఆసియా పెయింట్ 1.10 శాతం, హెచ్‌యూఎల్ 0.79 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.50 శాతం, టాటా స్టీల్ 0.44 శాతం, బీఈఎల్ 0.41 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Market | Top losers..
ఎంఅండ్ఎం 1.34 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 0.98 శాతం, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ 0.86 శాతం, ఎయిర్టెల్ 0.64 శాతం, పవర్‌గ్రిడ్ 0.64 నష్టాలతో ఉన్నాయి.