అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | గ్లోబల్ మార్కెట్ల(Global Markets)లోని వీక్‌నెస్ ప్రభావం మన మార్కెట్లలోనూ కనిపిస్తోంది. వరుసగా మూడో సెషన్‌లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 186 పాయింట్లు, నిఫ్టీ పాయింట్ల 50 నష్టంతో కొనసాగుతున్నాయి.
ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, క్రూడ్ ఆయిల్(Crude Oil) ధరలు పెరుగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్(Profit booking)కు పాల్పడుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 161 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 480 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 76 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 115 పాయింట్లు కోల్పోయింది. తర్వాత సూచీలు కోలుకున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 186 పాయింట్ల నష్టంతో 83,124 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 25,459 వద్ద ఉన్నాయి.
టెలికాం, ఐటీ సెక్టార్లలో పతనం..
టెలికాం(Telecom), ఐటీ సెక్టార్ల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో మెటల్(Metal) ఇండెక్స్ 0..62 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.21 శాతం, కమోడిటీ 0.18 శాతం లాభాలతో ఉన్నాయి. టెలికాం ఇండెక్స్ 1.36 శాతం, ఐటీ 0.84 శాతం, పవర్ 0.55 శాతం, ఇండస్ట్రియల్ 0.53 శాతం, రియాలిటీ 0.50 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.49 శాత నష్టంతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో ఉండగా.. 19 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. అదాని పోర్ట్స్ 1.35 శాఆతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.17 శాతం, బీఈఎల్ 0.94 శాతం, పవర్‌గ్రిడ్ 0.70 శాతం, సన్‌ఫార్మా 0.49 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎయిర్‌టెల్ 4.47 శాతం, టెక్ మహీంద్రా 1.13 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.08 శాతం, టీసీఎస్ 1.04 శాతం, ఎస్‌బీఐ 0.98 శాతం నష్టాలతో ఉన్నాయి.
