Homeబిజినెస్​Stock Market | నష్టాల్లోనే సూచీలు

Stock Market | నష్టాల్లోనే సూచీలు

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 162 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets) నష్టాల బాటలో సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 25 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి 333 పాయింట్లు పెరిగింది.

గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో 668 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ (Nifty) 14 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 90 పాయింట్లు ఎగబాకింది. అక్కడి నుంచి 190 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 162 పాయింట్ల నష్టంతో 84,241 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 25,816 వద్ద ఉన్నాయి.

పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో జోరు..

బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.60 శాతం, ఆటో(Auto) 0.61 శాతం, పీఎస్‌యూ 0.41 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.22 శాతం లాభాలతో ఉన్నాయి. యుటిలిటీ 1 శాతం, మెటల్‌ 0.83 శాతం, పవర్‌(Power) 0.76 శాతం, హెల్త్‌కేర్‌, కమోడిటీ 0.49 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ 0.39 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.16 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.09’ శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.03 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో ఉండగా.. 18 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఐటీసీ 1.24 శాతం, ఎస్‌బీఐ 1.20 శాతం, ఎల్‌టీ 0.91 శాం, మారుతి 0.88 శాతం, టీసీఎస్‌ 0.81 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎన్టీపీసీ 2.12 శాతం, ఎటర్నల్‌ 2.11 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.20 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.98 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.85 శాతం నష్టాలతో ఉన్నాయి.