Homeబిజినెస్​Stock Market | నష్టాల్లో సూచీలు..

Stock Market | నష్టాల్లో సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(Global Markets) పాజిటివ్‌గా ఉన్నా.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు మాత్రం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు ప్రాధాన్యత ఇవ్వడంతో దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నా.. సెన్సెక్స్‌, నిఫ్టీలు మాత్రం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 111 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 84,707 పాయింట్ల వరకు పెరిగినా.. అక్కడినుంచి 463 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) ఇంట్రాడేలో 25,944 స్థాయికి చేరుకున్న తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌తో 149 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 195 పాయింట్ల నష్టంతో 84,361 వద్ద, నిఫ్టీ 63 పాయింట్ల నష్టంతో 25,828 వద్ద ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ(FMCG), బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాలతో ప్రధాన సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి.

రాణిస్తున్న మెటల్‌ షేర్లు..

బీఎస్‌ఈ(BSE)లో మెటల్‌ ఇండెక్స్‌ 1.11 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.82 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.64 శాతం, రియాలిటీ(Realty) 0.61 శాతం, ఎనర్జీ 0.51 శాతం, ఇండస్ట్రియల్‌ 0.36 శాతం లాభంతో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 1.07 శాతం, సర్వీసెస్‌ 0.70 శాతం, హెల్త్‌కేర్‌ 0.68 శాతం, బ్యాంకెక్స్‌ 0.67 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.46 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.01 శాతం లాభంతో ఉండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.17 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.17 శాతం నష్టంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో ఉండగా.. 19 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎయిర్‌టెల్‌ 1.06 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.00 శాతం, బీఈఎల్‌ 0.97 శాతం, టాటా స్టీల్‌ 0.55 శాతం, సన్‌ఫార్మా 0.53 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్‌యూఎల్‌ 3.39 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 2.16 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.65 శాతం, టైటాన్‌ 1.14 శాతం, అదానిపోర్ట్స్‌ 1.12 శాతం నష్టాలతో ఉన్నాయి.