అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | యూఎస్ అధ్యక్షుడు(US President) డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన అదనపు టారిఫ్‌లతో మరోసారి వాణిజ్య యుద్ధం ముదురుతోంది. చైనా సైతం దీటుగా స్పందించడంతో మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 451 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ 82,043 నుంచి 82,329 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 25,152 నుంచి 25,241 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.55 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 291 పాయింట్ల నష్టంతో 82,209 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 25,196 వద్ద ఉన్నాయి.
Stock Markets | ఐటీలో సెల్లాఫ్..
బీఎస్‌ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్ 1.49 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.41 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.97శాతం, ఎనర్జీ 0.90 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.83 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.83 శాతం, పీఎస్‌యూ(PSU) 0.63 శాతం, పవర్ 0.62 శాతం, మెటల్ 0.61 శాతం నష్టంతో ఉన్నాయి. క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 0.65 శాతం, బ్యాంకెక్స్ 0.12 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.09 శాతం లాభాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో ఉండగా.. 21 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. అదాని పోర్ట్స్ 1.42 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.91 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.56 శాతం, ఎస్‌బీఐ 0.55 శాతం, ఎయిర్‌టెల్ 0.51 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Markets | Top losers..
ఇన్ఫోసిస్ 1.93 శాతం, టాటామోటార్స్ 1.67 శాతం, ట్రెంట్ 1.19 శాతం, టెక్ మహీంద్రా 1.14 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.05 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.