Homeబిజినెస్​Stock Market | నష్టాల్లోనే సూచీలు

Stock Market | నష్టాల్లోనే సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | యూఎస్‌ వాణిజ్య సుంకాల (Tariffs) విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడం, వడ్డీ రేట్ల కోత విషయంలో ఆర్‌బీఐ (RBI) యథాతథ స్థితిని కొనసాగించడంతో మార్కెట్లు కాస్త డీలా పడ్డాయి. బుధవారం ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి.

బుధవారం ఉదయం 16 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ (Sensex).. అక్కడినుంచి 140 పాయింట్లు పెరిగింది. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ తర్వాత ఒత్తిడికి గురై ఇంట్రాడేలో గరిష్టంగా 386 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 8 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై 30 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 1,132 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్‌ 166 పాయింట్ల నష్టంతో 80,543 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 24,574 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,347 కంపెనీలు లాభపడగా 2,705 స్టాక్స్‌ నష్టపోయాయి. 152 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 117 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 131 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.81 లక్షల కోట్లు తగ్గింది.

Stock Market | బ్యాంకింగ్‌ స్టాక్స్‌ మినహా..

బ్యాంకింగ్‌ స్టాక్స్‌ మినహా మిగతా అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో ఐటీ (IT)1.78 శాతం, హెల్త్‌కేర్‌ 1.72 శాతం, రియాలిటీ 1.55 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.83 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.80 శాతం, టెలికాం 0.75 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 0.64 శాతం, యుటిలిటీ, పవర్‌ ఇండెక్స్‌లు 0.75 శాతం, ఆటో సూచీ 0.52 శాతం నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌(PSU Bank) 0.55 శాతం, బ్యాంకెక్స్‌ 0.10 శాతం లాభపడ్డాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.14 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఒక శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.39 శాతం క్షీణించాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో, 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఆసియా పెయింట్‌ 2.19 శాతం, బీఈఎల్‌ 0.80 శాతం, ట్రెంట్‌ 0.79 శాతం, అదాని పోర్ట్స్‌ 0.67 శాతం, ఎస్‌బీఐ 0.56 శాతం లాభపడ్డాయి.

Must Read
Related News