Stock Markets
Stock Markets | భారీ లాభాల్లో సూచీలు.. 83 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ఫెడ్‌ రేట్‌ కట్‌ (Fed rate cut) ప్రకటన తర్వాత గ్లోబల్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఫెడ్‌ నిర్ణయంతో ఐటీ స్టాక్స్‌ దూసుకుపోతున్నాయి. దీంతో మన మార్కెట్లు ఆల్‌టైం హై దిశగా సాగుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ 415 పాయింట్లు, నిఫ్టీ 111 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్‌ (Sensex) 82,920 నుంచి 83,108 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,393 నుంచి 25,441 పాయింట్ల మధ్యలో స్వల్ప రేంజ్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 340 పాయింట్ల లాభంతో 83,034 వద్ద, నిఫ్టీ(Nifty) 90 పాయింట్ల లాభంతో 25,4207 వద్ద ఉన్నాయి. ముడి చమురు ధర తగ్గుతుండడం, రూపాయి(Rupee) విలువ బలపడుతుండడం, మార్కెట్‌ అస్థిరతను సూచించే విక్స్‌ కొంతకాలంగా తక్కువ స్థాయిలలోనే ఉంటుండడం, అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతుండడం వంటి కారణాలతో మన మార్కెట్లు పెరుగుతున్నాయి.

Stock Markets | మిక్స్‌డ్‌గా సూచీలు..

బీఎస్‌ఈలో (BSE) ఐటీ ఇండెక్స్‌ 0.81 శాతం పెరగ్గా.. క్యాపిటల్‌ మార్కెట్‌ 0.52 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.43 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 0.20 శాతం, ఎఫ్‌ఎంసీజీ (FMCG) 0.32 శాతం, బ్యాంకెక్స్‌ 0.30 శాతం పెరిగాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.36 శాతం, ఎనర్జీ 0.25 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.20 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.20 శాతం నష్టంతో ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.06 శాతం లాభాలతో ఉండగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.01 శాతం నష్టంతో కొనసాగుతోంది.

Stock Markets | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో ఉండగా.. 11 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఇన్ఫోసిస్‌ 1.51 శాతం, ఎటర్నల్‌ 1.46 శాతం, సన్‌ఫార్మా 1.02 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.01 శాతం, హెచ్‌యూఎల్‌ 1.00 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Markets | Top losers..

బీఈఎల్‌ 0.72 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.50 శాతం, టాటా మోటార్స్‌ 0.42 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.34 శాతం, టెక్‌ మహీంద్రా 0.28 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.