అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) కొత్త వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం 131 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాటలో దూసుకుపోతోంది.
ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 876 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 244 పాయిట్లు పెరిగింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 846 పాయింట్ల లాభంతో 80, 059 వద్ద, నిఫ్టీ 230 పాయింట్ల లాభంతో 24,269 వద్ద కదలాడుతున్నాయి. క్యూ4 ఫలితాల జోష్‌తో రిలయన్స్(Reliance) దూసుకుపోతోంది. నాలుగు శాతానికిపైగా పెరిగి సూచీలను పైకి తీసుకువెళ్తోంది.
Stock Market | అన్ని రంగాల్లో జోష్..
ఐటీ(IT) మినహా అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 0.33 శాతం మేర నష్టంతో కదలాడుతోంది. బీఎస్‌ఈ లార్జ్ క్యాప్(Large cap), మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు ఒక శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అర శాతం వరకు పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, పవర్, బ్యాంకెక్స్ ఇండెక్స్‌లు రాణిస్తున్నాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో ముగియగా 10 కంపెనీలు మాత్రం నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ 4.33 శాతం లాభపడగా.. సన్‌ఫార్మా, టాటా స్టీల్ రెండు శాతం మేర పెరిగాయి. ఇండస్ ఇండ్(Indusind bank), అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ(NTPC), ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ ఒక శాతానికిపైగా లాభపడ్డాయి.
Stock Market | Top losers..
హెచ్‌సీఎల్ టెక్ 1.81 శాతం పడిపోగా.. బజాజ్ ఫైనాన్స్(Bajaj finance), ఎటర్నల్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా నష్టాల బాటలో ఉన్నాయి.
