Homeతాజావార్తలుStock Markets | భారీ లాభాల్లో సూచీలు.. 26 వేల మార్క్‌పైన నిఫ్టీ

Stock Markets | భారీ లాభాల్లో సూచీలు.. 26 వేల మార్క్‌పైన నిఫ్టీ

భారత్‌, యూఎస్‌ వాణిజ్య ఒప్పందంపై ఆశలతో బెంచ్‌మార్క్‌ సూచీలు రికార్డు హైస్‌ మరింత చేరువయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) నెగెటివ్‌గా ఉన్నా దేశీయ స్టాక్‌ మార్కెట్లు మాత్రం భారీ లాభాలతో సాగుతున్నాయి. యూఎస్‌ వాణిజ్య ఒప్పందం(Trade deal)పై ఆశలు, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో నిఫ్టీ, సెన్సెక్స్‌లు రికార్డు స్థాయికి చేరువయ్యాయి.

గురువారం ఉదయం సెన్సెక్స్‌ 728 పాయింట్ల లాభంతో, నిఫ్టీ(Nifty) 189 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 85,272 పాయింట్లకు చేరుకున్నా.. గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ జరగడంతో ఒక దశలో 84,867 పాయింట్లకు తగ్గింది. నిఫ్టీ ఇంట్రాడే(Intraday)లో 26,099 స్థాయికి చేరుకున్న తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా 25,991కి తగ్గింది. తర్వాత కోలుకున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 638 పాయింట్ల లాభంతో 85,064 వద్ద, నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 26,051 వద్ద ఉన్నాయి.

Stock Markets | ఐటీలో దూకుడు..

హెచ్‌ 1 బీ వీసాలపై సడలింపులతో ఐటీ షేర్లు కోలుకున్నాయి. ఐటీ(IT) తోపాటు బ్యాంక్‌ స్టాక్స్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 2.99 శాతం పెరగ్గా.. బ్యాంకెక్స్‌ 1.22 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.04 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.88 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.68 శాతం, పవర్‌ 0.64 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.50 శాతం లాభాలతో ఉన్నాయి. టెలికాం(Telecom) 0.63 శాతం, సర్వీసెస్‌ 0.36 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.25 శాతం, ఎనర్జీ 0.23 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.69 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.40 శాతం లాభాలతో ఉండగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.08 శాతం నష్టంతో ఉన్నాయి.

Stock Markets | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 25 కంపెనీలు లాభాలతో ఉండగా.. 5 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఇన్ఫోసిస్‌ 4.31 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.12 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.95 శాతం, టీసీఎస్‌ 2.55 శాతం, టెక్‌ మహీంద్రా 1.97 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Markets | Losers..

ఎటర్నల్‌ 2.01 శాతం, ఎయిర్‌టెల్‌ 1.47 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.34 శాతం, అదానిపోర్ట్స్‌ 0.33 శాతం, రిలయన్స్‌ 0.33 శాతం నష్టాలతో ఉన్నాయి.