అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock markets | యూఎస్, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం (Trade deal) కోసం ఇరు దేశాల అధ్యక్షులు ఈనెల 30న సమావేశమవుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీంతో మన స్టాక్ మార్కెట్లు (Stock markets) సైతం నూతన వారాన్ని ఆశావహ దృక్పథంతో ప్రారంభించాయి.
మోస్తరు లాభాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు.. ఆ తర్వాత భారీ ర్యాలీ దిశగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం 86 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 580 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ప్రారంభమై 16 పాయింట్లు తగ్గినా అక్కడినుంచి కోలుకుని గరిష్టంగా 159 పాయింట్లు లాభపడిరది.
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 706 పాయింట్ల లాభంతో 84,918 వద్ద, నిఫ్టీ (Nifty) 202 పాయింట్ల లాభంతో 25,997 వద్ద ఉన్నాయి. యూఎస్ ఇన్ల్ఫెషన్ డాటా అంచనాలకన్నా తక్కువగా రావడంతో ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగాయి. యూఎస్‌లో వడ్డీ రేట్లు తగ్గితే ఎఫ్‌ఐఐ(FII)లు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలవైపు చూసే అవకాశాలు ఉంటాయన్న ఆశలతో దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిరది. రిలయన్స్ (Reliance), టాటా మోటార్స్, ఎయిర్‌టెల్ సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
Stock markets | రాణిస్తున్న టెలికాం, పీఎస్‌యూ షేర్లు..
ఫార్మా (Pharma) రంగం మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో టెలికాం (Telecom) ఇండెక్స్ 3.13 శాతం, రియాలిటీ 1.64 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.29 శాతం, ఎనర్జీ 1.17 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.97శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.83 శాతం, మెటల్, సర్వీసెస్ ఇండెక్స్‌లు 0.70 శాతం లాభాలతో ఉన్నాయి. హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.10 శాతం నష్టంతో కదలాడుతోంది. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.60 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం లాభంతో ఉన్నాయి.
Stock markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఎయిర్‌టెల్ 2.85 శాతం, రిలయన్స్ 2.19 శాతం, టాటా మోటార్స్ 1.64 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.60 శాతం, టాటా స్టీల్ 1.43 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock markets | Top losers..
బీఈఎల్ 1.27 శాతం, ఇన్ఫోసిస్ 1.26 శాతం, కొటక్ బ్యాంక్ 0.83 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.82 శాతం, ఎంఅండ్‌ఎం 0.30 శాతం నష్టాలతో ఉన్నాయి.
1 comment
[…] Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు (Global markets) మిశ్రమంగా సాగుతున్నాయి. యూఎస్ […]
Comments are closed.