అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heavy Losses in Stock Market | ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెంచడంతో గత సెషన్లో కుదేలయిన దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market).. సోమవారం సైతం తీవ్ర ఒత్తిడికి లోనయ్యింది. ప్రారంభంలో లాభాల బాట పట్టినట్లు కనిపించినా మళ్లీ సెల్లాఫ్‌కు గురయ్యింది.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా తేరుకుని 656 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరోసారి అమ్మకాల ఒత్తిడితో 731 పాయిట్లు కోల్పోయింది. నిఫ్టీ (Nifty) 29 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 146 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 216 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 215 పాయింట్ల నష్టంతో 80,507 వద్ద, నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 24,717 వద్ద ఉన్నాయి.
అన్ని రంగాలలో సెల్లాఫ్..
పీఎస్‌యూ బ్యాంక్స్‌లో సెల్లాఫ్ కొనసాగుతోంది. ఫార్మా, కన్జూమర్ డ్యూరెబుల్, FMCG, ఐటీ, టెలికాం, ఇండస్ట్రియల్ రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ మాత్రమే స్వల్ప లాభాలతో సాగుతోంది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో ఉండగా.. 18 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. అదానిపోర్ట్స్ 2.67 శాతం, ఆసియన్ పెయింట్ 1.73 శాతం, ఎల్టీ 1.23 శాతం, రిలయన్స్ 1.19 శాతం, కొటక్ బ్యాంక్ 0.95 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎస్బీఐ 2.37 శాతం, ఐటీసీ 2.34 శాతం, టైటాన్ 2.07 శాతం, ట్రెంట్ 1.66 శాతం, Infosys 1.57 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.