అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets in Red | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మళ్లీ నష్టాల బాట పట్టింది. రూపాయి విలువలో బలహీనత, జియో పొలిటికల్ టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడంతోపాటు బడ్జెట్ ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ గరిష్టాల వద్ద లాభాలు స్వీకరిస్తున్నారు. దీంతో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. గురువారం ఉదయం సెన్సెక్స్ 24 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై మరో 18 పాయింట్లు మాత్రమే పెరిగింది.
అక్కడినుంచి ఒక్కసారిగా పతనం ప్రారంభమై 670 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ (Nifty) 3 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై మరో 14 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 200 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 390 పాయింట్ల నష్టంతో 81,954 వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 25,236 వద్ద ఉన్నాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ తీవ్ర ఒత్తిడి తీవ్రంగా ఉంది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, పీఎస్‌యూ రంగాల షేర్లు రాణిస్తుండగా.. కన్జూమర్ డ్యూరెబుల్, ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, సర్వీసెస్ రంగాల షేర్లు భారీగా సెల్లాఫ్‌కు గురవుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎల్టీ 2.83 శాతం, ఎన్టీపీసీ 2.56 శాతం, టాటా స్టీల్ 1.83 శాతం, ఎటర్నల్ 1.20 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.93 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఆసియన్ పెయింట్ 3.22 శాతం, టైటాన్ 3.19 శాతం, ఎంఅండ్ ఎం 3.13 శాతం, ఇండిగో 2.96 శాతం, మారుతి 2.72 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.