అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ఆసియా మార్కెట్లు(Asian Markets) నెగెటివ్‌గా సాగుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 333 పాయింట్లు, నిఫ్టీ పాయింట్ల 104 నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market)లో లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతుండడంతో దాని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. దీంతో బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాటలో సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 136 పాయింట్లు, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్(Sensex) 83,726 వరకు పెరిగినా అక్కడినుంచి 83,124 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 25,637 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసి అక్కడినుంచి 25,449 పాయింట్లకు పతనమైంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 333 పాయింట్ల నష్టంతో 83,201 వద్ద, నిఫ్టీ(NIfty) 104 పాయింట్ల నష్టంతో 25,47 వద్ద ఉన్నాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, ఐపీవో(IPO)ల కారణంగా సెకండరీ మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గడంతో ఫాలోఅప్ బయ్యింగ్ రాకపోవడంతో సూచీలు నిలదొక్కుకోలేకపోతున్నాయి. నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ ఉండడంతో మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది.
ఐటీ, టెలికాం మినహా..
ఐటీ(IT), టెలికాం రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. బీఎస్‌ఈలో టెలికాం(Telecom) ఇండెక్స్ 0.95 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.59 శాతం, ఐటీ ఇండెక్స్ 0.41 శాతం, సర్వీసెస్ 0.39 శాతం, ఇండస్ట్రియల్ 0.19 శాతం పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంక్ (PSU bank) ఇండెక్స్ 1.36 శాతం, రియాలిటీ 0.96 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.66 శాతం, యుటిలిటీ 0.62 శాతం, హెల్త్‌కేర్ 0.59 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.57 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.55 శాతం, మెటల్ ఇండెక్స్ 0.53 శాతం, ఎనర్జీ 0.53 శాతం నష్టంతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.46 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో ఉండగా.. 17 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 1.44 శాతం, ఎయిర్‌టెల్ 1.04 శాతం, ట్రెంట్ 00.97 శాతం, ఎంఅండ్‌ఎం 0.96 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.66 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 7.73 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 7.37 శాతం, టాటామోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 1.72 శాతం, టాటా స్టీల్ 0.91 శాతం, పవర్‌గ్రిడ్ 0.84 శాతం నష్టాలతో ఉన్నాయి.
