అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా ఉండడంతో మన మార్కెట్లు సైతం నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 464 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
యూఎస్ ఫెడ్ (US Fed) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర కట్ చేసినా.. భవిష్యత్ రేట్ కట్‌ల విషయంలో ఫెడ్ ఛైర్మన్ చేసిన కామెంట్లు మార్కెట్‌ను నిరుత్సాహ పరిచాయి. డిసెంబర్‌లో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 283 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 439 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 69 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 92 పాయింట్లు పడిపోయింది. అక్కడి నుంచి కోలుకుని 140 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 464 పాయింట్ల నష్టంతో 84,532 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 25,905 వద్ద ఉన్నాయి.
మెటల్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి..
బీఎస్‌ఈలో (BSE) టెలికాం ఇండెక్స్ 2.21 శాతం నష్టపోగా.. మెటల్ 0.86 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.65 శాతం, ఐటీ 0.58 శాతం, కమోడిటీ 0.53 శాతం, హెల్త్‌కేర్ (Health care) 0.51 శాతం, యుటిలిటీ 0.49 శాతం నష్టాలతో ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ 0.73 శాతం, ఎనర్జీ 0.49 శాతం, ఇండస్ట్రియల్ 0.33 శాతం, పీఎస్‌యూ 0.12 శాతం లాభాలతో కదలాడుతున్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎల్‌టీ 1.09 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.56 శాతం, బీఈఎల్ 0.48 శాతం, మారుతి 0.32 శాతం, అదాని పోర్ట్స్ 0.29 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎయిర్‌టెల్ 1.80 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.30 శాతం, టెక్ మహీంద్రా 1.26 శాతం, సన్‌ఫార్మా 1.23 శాతం, టాటా స్టీల్ 1.22 శాతం నష్టాలతో ఉన్నాయి.

