More
    Homeబిజినెస్​Stock Market | లాభాల్లో స్టాక్​ మార్కెట్​

    Stock Market | లాభాల్లో స్టాక్​ మార్కెట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | అమెరికా ఫెడరల్‌(US Fed) రిజర్వ్‌ వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించే అవకాశాలు ఉండడం, భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌పై చర్చలు కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడుతోంది.

    కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతు ఇస్తుండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాటలో పయనిస్తోంది. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 67 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 4 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 81,779 నుంచి 82,168 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,070 నుంచి 25,181 పాయింట్ల మధ్యలో ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం 11.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 334 పాయింట్ల లాభంతో 82,120 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 25,167 వద్ద ఉన్నాయి.

    Stock Market | అన్ని రంగాలూ గ్రీన్‌లోనే..

    చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. బీఎస్‌ఈలో సర్వీసెస్‌ ఇండెక్స్‌(Services index) 1.07 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.02 శాతం పెరగ్గా.. యుటిలిటీ 0.92 శాతం, పవర్‌ 0.89 శాతం, ఇన్‌ఫ్రా 0.74 శాతం, ఎనర్జీ 0.67 శాతం, టెలికాం 0.63 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.57 శాతం లాభాలతో సాగున్నాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.58 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.46 శాతం, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.40 శాతం లాభాలతో ఉన్నాయి.

    Stock Market | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 23 కంపెనీలు లాభాలతో ఉండగా.. 7 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. కోటక్‌ బ్యాంక్‌ 2.16 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.53 శాతం, ఎల్‌టీ 1.20 శాతం, ఎన్టీపీసీ 1.16 శాతం, ఎంఅండ్‌ఎం 1.06 శాతం లాభాలతో ఉన్నాయి.

    Stock Market | Top losers..

    టైటాన్‌ 0.57 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.46 శాతం, ఆసియా పెయింట్‌ 0.31 శాతం, ఇన్ఫోసిస్‌ 0.20 శాతం, టెక్‌ మహీంద్రా 0.15 శాతం నష్టంతో ఉన్నాయి.

    More like this

    Job Mela | కామరెడ్డిలో నిరుద్యోగులకు జాబ్​మేళా

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Job Mela | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) నిరుద్యోగ యువతకు ప్రైవేట్​ రంగంలో ఉద్యోగావకాశాలు...

    Private School | ప్రైవేట్​ పాఠశాలలో దారుణం.. విద్యార్థిని తల పగిలేలా కొట్టిన టీచర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private School | ఓపికగా ఉండి విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన కొందరు టీచర్లు (Teachers)...

    Yellareddy mandal | పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారుల సర్వే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | ఎల్లారెడ్డి మండలంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంలో (Pradhan Mantri...