అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంతో, నిఫ్టీ(Nifty) 19 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 84,068 పాయింట్ల వరకు పెరిగినా నిలదొక్కుకోలేక అక్కడినుంచి 391 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 25,659 నుంచి 25,787 పాయింట్ల మధ్యలో కదలాడుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 280 పాయింట్ల నష్టంతో 83,697 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 25,662 వద్ద ఉన్నాయి.
ఐటీ, మెటల్ సెక్టార్లలో పతనం..
ఐటీ(IT), మెటల్, ఇన్‌ఫ్రా తదిరత రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈలో టెలికాం(Telecom) ఇండెక్స్ 1.13 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.48 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.39 శాతం లాభాలతో ఉన్నాయి. యుటిలిటీ ఇండెక్స్ 1.32 శాతం, ఐటీ 1.00 శాతం, మెటల్(Metal) 0.95 శాతం, ఇన్‌ఫ్రా 0.89 శాతం, పవర్ 0.84 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.83 శాతం, ఆటో 0.72 శాతం, కమోడిటీ 0.66 శాతం నష్టంతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో ఉండగా.. 24 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
 టైటాన్ 2.34 శాతం, ఎయిర్‌టెల్ 2.01 శాతం, అదాని పోర్ట్స్ 0.25 శాతం, రిలయన్స్ 0.22 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.11 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : పవర్‌గ్రిడ్ 2.78 శాతం, టాటా మోటార్స్ 1.77 శాతం, ఎటర్నల్ 1.66 శాతం, సన్‌ఫార్మా 1.19 శాతం, బీఈఎల్ 1.15 శాతం నష్టాలతో ఉన్నాయి.
